దేవరకొండ టైం బాగుంది..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ డైరక్షన్ లో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్. కె.ఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండలో నలుగురు భామలు రొమాన్స్ చేశారు. డియర్ కామ్రేడ్ తర్వాత కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన అవసరం ఉండగా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అంచనాలను అందుకోలేదు. సినిమా వసూళ్ల పరంగా కూడా డిజాస్టర్ అయ్యింది. అయితే ప్రస్తుతం కరోనా వల్ల లాక్ డౌన్ చేయగా డియర్ కామ్రేడ్ సినిమా చూస్ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియెన్స్. 

అదెలా అనుకుంటున్నారు కదా.. లాక్ డౌన్ టైం లో ఎక్కువగా సినిమాలు చూసి టైం పాస్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా రిలీజైన సినిమాలన్నీ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ తో పాటుగా తెలుగు ఓటిటి యాప్ ఆహా కూడా సూపర్ గా క్లిక్ అయ్యింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. అయితే వెండితెర మీద ప్లాప్ అనిపించుకున్న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో మాత్రం టాప్ లో నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ అవడం విశేషం. అలా లాక్ డౌన్ టైం విజయ్ దేవరకొండకు బాగా కలిసి వచ్చింది.