పూరి@20 ఇయర్స్..!

టాలీవుడ్ లో డేరింగ్ డ్యాషింగ్ డైరక్టర్ అనగానే గుర్తొచ్చే పేరు పూరి జగన్నాథ్. బద్రి నుండి ఇస్మార్ట్ శంకర్ వరకు పూరి 35 సినిమాలు చేసిన పూరి జగన్నాథ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. పూరి సినిమా అంటే స్టార్ హీరోలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆయన సినిమాల్లో చేసిన తర్వాత స్టార్ హీరోల ఇంతకుముందు ఇమేజ్ పూర్తిగా మారిపోవాల్సిందే. ఏప్రిల్ 20, 2000 బద్రి సినిమా రిలీజైన రోజు.. అంటే నేటితో దర్శకుడిగా పూరి జగన్నాథ్ తన 20 ఎల్లా సిని కెరియర్ పూర్తి చేసుకున్నాడు. 

ఈ 35 సినిమాల్లో పూరి ఇండస్ట్రీ రికార్డులను సైతం బద్దలు కొట్టే సినిమాలు చేశాడు. పూర్ సినిమాలో హీరోలు డిఫరెంట్ గా ఉంటారు. అందరు దర్శకులు ట్రెండ్ ఫాలో అయితే డైరక్టర్ పూరి మాత్రం ట్రెండ్ సెట్ చేయాలని చూస్తాడు. టెంపర్ తర్వాత ట్రాక్ తప్పిన పూరి లాస్ట్ ఇయర్ వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు పూరి. 20 ఏళ్ళు కాదు మరో 20 ఏళ్ళు కూడా డైరక్టర్ పూరి తన కెరియర్ కొనసాగించాలని ఆశిద్దాం.