
ఒక భయంకరమైన వైరస్ ను ప్రపంచం మీదకు వదిలిన చైనాను క్షమించకూడదని అంటుంది తెలుగు బుల్లితెర యాంకర్ శిల్పా చక్రవర్తి. అంతేకాదు చైనా ప్రొడక్టులను వాడడం మానేయాలని.. చైనా డెవలప్ చేసినా టిక్ టాక్ ను అన్ ఇన్ స్టాల్ చేయాలని అంటుంది అమ్మడు. ఇదివరకు తాను కూడా టిక్ టాక్ లో వీడియోలు చేశానని అయితే ఎప్పుడైతే కోవిడ్-19 చైనా నుండి వచ్చిందని తెలిసిందో అప్పుడే టిక్ టాక్ ను డిలీట్ చేశానని అన్నది శిల్ప చక్రవర్తి.
సెలబ్రిటీస్ అంతా టిక్ టాక్ ను డిలీట్ చేయాలని.. ప్రజలు కూడా ఈ టిక్ టాక్ ను వాడకూడదని. టిక్ టాక్ ను ఇండియా నుండి బ్యాన్ చేయాలని అంటుంది శిల్పా చక్రవర్తి. యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న శిల్పా చక్రవర్తి బిగ్ బాస్ సీజన్ 3 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. అయితే కేవలం రెండు వారాలు మాత్రమే ఆమె బిగ్ బాస్ హౌజ్ లో ఉంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఆమె షో మీద నెగటివ్ కామెంట్స్ చేశారు.