మరో హీరోయిన్ విడాకులకు రెడీ..!

యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై అలరించిన భామ స్వాతి. మా టివిలో కలర్స్ ప్రోగ్రామ్ తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఆ తర్వాత వెండితెర మీద ఛాన్సులు అందుకుంది. తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ కు పెద్దగా అవకాశాలు రావు. స్వాతికి కూడా టాలీవుడ్ లో స్టార్ ఛాన్సులు రాలేదు. యువ హీరోల సరసన చేసినా అవి కూడా పెద్దగా ఆడలేదు. అందుకే కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టి రెండేళ్ల క్రితం పైలెట్ వికాస్ వాసుని పెళ్లాడింది అమ్మడు. 

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైనా స్వాతి మళ్ళీ ఇప్పుడు సినిమాలు చేయాలని అనుకుంటుందట. అంతేకాదు భర్తతో విడిపోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రేమించి పెళ్లాడిన ఈ ఇద్దరి మధ్య ఈమధ్య గొడవలు బాగా ఎక్కువయ్యాయట. ఒకరి రెండు సార్లు ఇటు కుటుంబ సభ్యులు సర్ది చెప్పగా ఈసారి గొడవ మరింత ముదిరిందని అంటున్నారు. త్వరలోనే ఈ ఇద్దరు విడాకులు తీసుకుంటారని తెలుస్తుంది. అయితే ఈ వార్తలపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు.