
నాచురల్ స్టార నాని, కోలీవుడ్ హీరో విశాల్ ఇద్దరు కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. నాని ప్రస్తుతం వి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాతో పాటుగా శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీశ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత నాని తమిళ హీరో విశాల్ తో ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్.
యాత్ర ఫేమ్ మహి వి రాఘవ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారట. ఇప్పటికే అటు విశాల్, ఇటు నానీలు డైరక్టర్ కథ వినిపించాడట. కొన్ని మార్పులతో ఈ మల్టీస్టారర్ కు నాని ఓకే చెప్పాడట. డైరెక్ట్ తెలుగు సినిమా కోసం ఎదురుచూస్తున్న విశాల్ కు నానితో కలిసి చేయడం లక్కీ అని చెప్పొచ్చు. విశాల్ తెలుగు వాడే అయినా తమిళంలో హీరోగా స్థిరపడ్డాడు. మరి నానితో విశాల్ చేసే ఈ మల్టీస్టారర్ ఎలా ఉంటుందో చూడాలి.