లవర్ బోయ్ గా మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ 27వ సినిమా త్వరలో బిగ్ ఎనౌన్స్ మెంట్ రానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పరశురామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. గీతా గోవిందంతో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన దర్శకుడు పరశురామ్ తన నెక్స్ట్ సినిమాకు ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సి వస్తుందని ఊహించలేదు. అయితే హీరోకి తగిన కథ సిద్ధం చేయడంలో సిద్ధహస్తుడైన పరశురామ్ బన్నీ, రామ్ చరణ్, సాయి తేజ్ ఇలా మెగా హీరోలందరికీ కథలు రెడీ చేశాడట. కాని వాళ్లంతా వేరు వేరు సినిమాలతో బిజీగా ఉండటంతో మహేష్ కోసం రెడీ చేసిన కథ చెప్పి ఆయన్ను ఒప్పించారు. 

ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుందని అంటున్నారు. ఇక సినిమాలో మహేష్ లవర్ బోయ్ గా కనిపిస్తారట. మెచ్యూర్డ్ లవర్ బోయ్ గా మహేష్ మెప్పిస్తాడని తెలుస్తుంది. పరశురామ్ రాసిన కథ బాగా వచ్చిందట. అంతేకాదు మహేష్ పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందని.. తప్పకుండా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను మెప్పిస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్, కియరా అద్వానీ లాంటి హీరోయిన్స్ నటిస్తారని వార్తలు రాగా లేటెస్ట్ టాక్ ప్రకారం సాహో భామ శ్రద్ధా కపూర్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.