
కోలీవుడ్ స్టార్ శింబు ఎవరితో లవ్ ఎఫైర్ నడిపించినా ఆడో హాట్ న్యూస్ అవుతుంది. నయనతారతో లవ్వు గివ్వు అంటూ చాలా దూరం వెళ్లిన శింబు ఆమె దూరమయ్యాక కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి మరో హీరోయిన్ హాన్సికతో ప్రేమలో పడ్డాడు. హాన్సికతో కూడా కొన్నాళ్ళు లవ్ స్టోరీ నడిపించిన శింబు ఆమె నుండి విడిపోయాడు. చెప్పాలంటే శింబు నుండి హాన్సికనే దూరం వెళ్లిందని చెప్పొచ్చు. అయితే శింబుతో విడిపోయాక నయనతార మళ్ళీ ప్రభుదేవా లవ్ లో పడ్డది.. అఫ్కోర్స్ ఆ లవ్ స్టోరీ కూడా మధ్యలోనే ఆగిందనుకోండి. ప్రస్తుతం నయనతార విఘ్నేష్ శివన్ తో సహజీవనం చేస్తుంది.
ఇక శింబు మాత్రం మళ్ళీ హాన్సికకు దగ్గరవ్వాలని చూస్తున్నాడట. ఈమధ్యనే హాన్సిక చేస్తున్న సినిమాలో శింబు గెస్ట్ రోల్ చేస్తున్నాడట శింబు. సెట్స్ లో హన్సికతో శింబు చాలాసేపు మాట్లాడుతున్నాడని టాక్. ఇక లేటెస్ట్ గా తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన హాన్సికకు శింబుతో మళ్ళీ లవ్ స్టోరీ కంటిన్యూ చేస్తున్నారా అన్న ప్రశ్నలే ఎక్కువమంది అడిగారట. ప్రేమించి ఏవో కొన్ని కారణాల వల్ల విడిపోతే ఆ తర్వాత వాళ్లిద్దరూ స్నేహితులుగా ఉండకూడదా అని ప్రేక్షకులకు ఎదురు ప్రశ్న వేస్తుంది హాన్సిక. అయితే అమ్మడు చెప్పిన దానిలో పాయింట్ ఉన్నా హాన్సికకు దగ్గరవ్వాలని శింబు కావాలనే చేస్తున్నాడని కొందరు అంటున్నారు. మరి వీరి లవ్ స్టోరీ బ్రేక్ అయినా పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ కలిసేలా ఉన్నారని కోలీవుడ్ టాక్.