ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్ తోనే..!

సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఎన్నాళ్ళనుండో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న క్రేజీ కాంబో మూవీకి లైన్ క్లియర్ అయ్యింది. దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ సినిమా గురించి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. రాజమౌళి,మహేష్ కలిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న రాజమౌళి తన నెక్స్ట్ సినిమా మహేష్ తోనే అని కన్ఫర్మ్ చేశాడు. 

ఆర్.ఆర్.ఆర్ తర్వాత కె.ఎల్ నారాయణ నిర్మాణంలో మహేష్ తో సినిమా చేస్తానని రాజమౌళి ఎనౌన్స్ చేశారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ పరశురామ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. పరశురామ్ తో సినిమా పూర్తి కాగానే మహేష్ తో రాజమౌళి సినిమా ఉంటుంది. బాహుబలితో రికార్డులు సృష్టించిన రాజమౌళి ట్రిపుల్ ఆర్ తో వాటిని కల్లగొట్టే ప్లాన్ చేశాడు. ఇక ఆర్.ఆర్.ఆర్ రికార్డుల కోసం మహేష్ మూవీ సెట్ చేస్తున్నాడు. లాక్ డౌన్ టైం లో మహేష్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త చెప్పిన రాజమౌళి సూపర్ స్టార్ ఫ్యాన్స్ థ్యాంక్స్ చెబుతున్నారు.