
కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు సీసీసీ ద్వారా నిత్యావసరాలను అందించే ఏర్పాటు చేశారు. చిరంజీవి ఆధ్వర్యంలో ఎన్. శంకర్, తమ్మారెడ్డి భరధ్వాజ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ చేస్తున్న ఈ మంచి పనికి తన వంతు సహకారం అందించారు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. తెలుగులో ఆయన సినిమాలు చేయకపోయినా సిసిసికి 1500 రూపాయల ఫుడ్ కూపన్లను 12 వేలు సిసిసికి పంపించారట.
ఆ కూపన్లు అన్ని సూపర్ మార్కెట్ లో చెల్లుతాయని తెలుస్తుంది. సిసిసికి సహాయం చేసినందుకు బిగ్ బీకి బిగ్ థ్యాంక్స్ చెప్పారు చిరంజీవి. ఈ కూపన్లు బిగ్ బజార్ లో కూడా రిడీమ్ చేసుకోవచ్చని ట్వీట్ చేశారు చిరంజీవి. కరోనా క్రైసిస్ వల్ల సినీ కార్మికులకు అండగా సినీ స్టార్స్ ఉన్నారు ఇప్పటికే నిత్యావసరాలు కార్మికులకు అందిస్తున్నారట.