
టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన హరీష్ శంకర్ లాస్ట్ ఇయర్ గద్దలకొండ గణేష్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న హరీష్ శంకర్ త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో హరీష్ శంకర్ డైరక్షన్ లో పవన్ సినిమా ఎనౌన్స్ చేశారు.
ఈ సినిమా కథ బాగా వచ్చిందని సినిమా కచ్చితంగా హిట్టు కొడుతుందని అంటున్నాడు హరీష్ శంకర్. పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ లాంటి హిట్టు కొట్టిన హరీష్ శంకర్ ఈసారి ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. స్క్రిప్ట్ దశ నుండే పవన్ సినిమాకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పవన్ సినిమా తర్వాత మహేష్ కోసం హరీష్ శంకర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మహేష్ కోసం కథ రెడీ చేస్తున్నా అని చెప్పిన హరీష్ శంకర్ మహేష్ కు కథ వినిపించాలని ఉత్సాహంగా ఉన్నాడు.