.jpeg)
యువ హీరో నిఖిల్ లాస్ట్ ఇయర్ అర్జున్ సురవరం సినిమాతో హిట్ అందుకున్నాడు. రిలీజ్ వాయిదాలతో సినిమాపై క్రేజ్ తగ్గినా చిరు రాకతో సినిమా రిలీజ్ ముందు బజ్ ఏర్పడి ఎలాగోలా సూపర్ హిట్ అందుకుంది నిఖిల్ సినిమా. ఇక ఆ సినిమా తర్వాత ఒకేసారి రెండు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు నిఖిల్. అందులో ఒకటి సూపర్ హిట్ మూవీ కార్తికేయ సీక్వల్ కాగా.. మరోటి సుకుమార్ నిర్మాణంలో వస్తున్నా 18 పేజెస్. కుమారి 21f డైరక్టర్ సూర్య ప్రతాప్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా లవ్ స్టోరీగా రాబోతుంది.
ఇక ఈ సినిమాతో పాటుగా చందు మొండేటి డైరక్షన్ లో కార్తికేయ 2 వస్తుంది. ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో రిలీజై సినిమాపై అంచనాలు పెంచింది. ఐతే ఈ సినిమాను తెలుగుతో పాటుగా తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. కార్తికేయతో మెప్పించిన చందు, నిఖిల్ మరోసారి ఈ సీక్వల్ తో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. మరి తెలుగుతో పాటుగా మొదటిసారి తమిళ, హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నిఖిల్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.