
ఇస్మార్ట్ శంకర్ తో తిరిగి మళ్ళీ హిట్ ఫామ్ లోకి వచ్చిన డైరక్టర్ పూరి ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కథను పూరి అల్లు అర్జున్ కు వినిపించాడట. పూరి డైరక్షన్ లో దేశముదురుతో హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.
ఇక ఫైటర్ కథను అల్లు అర్జున్ కోసం రాయగా అతను చేయనని చెప్పడంతో కొద్దిగా కాటాలో మార్పులు చేర్పులు చేసి విజయ్ దేవరకొండకు వినిపించాడట. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో ప్లాపులు అందుకున్న విజయ్ దేవరకొండ ఫైటర్ తో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఇస్మార్ట్ హిట్ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కినా పూరి విజయ్ తో ఆ హిట్ మేనియా కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాను బాలీవుడ్ లో కారం జోహార్ రిలీజ్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.