
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటుగా చరణ్ కూడా నటిస్తున్నారు. సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇద్దరు రియల్ లైఫ్ సూపర్ స్టార్స్ కు సంబందించిన కథతో ట్రిపుల్ ఆర్ వస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.
ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత కూడా తమిళ క్రేజీ డైరక్టర్ అట్లీతో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ తో అట్లీ మూవీ బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ సెట్ చేసినట్టు తెలుస్తుంది. అవసరమైతే కథ తను అందిస్తానని చెప్పారట. విజయ్ తో వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ఫామ్ లో ఉన్న డైరక్టర్ అట్లీ తెలుగులో ఎన్టీఆర్ తో చేస్తే మాత్రం కచ్చితంగా రికార్డులు సృష్టిస్తుందని అంటున్నారు సినీ ప్రియులు.