
సూపర్ స్టార్ మహేష్ కు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ.. తన ప్రతి సినిమా విషయంలో ఆ సెంటిమెంట్స్ ఫాలో అవుతాడు. సెట్స్ మీద ఉన్న సినిమా అయినా.. సెట్స్ మీదకు వెళ్లాల్సిన సినిమా అయినా మే నెల వచ్చింది అంటే మహేష్ నుండి క్రేజీ అప్డేట్ వచ్చేస్తుంది. మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మహేష్ తన ఫ్యాన్స్ కు ఏదో ఒక కానుక ఇస్తున్నాడు. ఈ ఇయర్ కూడా మహేష్ తన తండ్రి కృష్ణ బర్త్ డే కానుకగా పరశురామ్ సినిమాకు ముహూర్తం పెట్టుకుంటారని తెలుస్తుంది.
సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ అసలైతే వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉండగా స్క్రిప్ట్ విషయంలో తేడా రావడంతో సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడు మహేష్. గీతా గోవిందం తర్వాత తీస్తే స్టార్ తోనే సినిమా తీయాలని చూస్తున్న పరశురామ్ మహేష్ ను మెప్పించే కథ సిద్ధం చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ సాయంతో మహేష్ కు కథ వినిపించి సినిమా ఫిక్స్ చేసుకున్నాడు పరశురామ్. సినిమా దాదాపు కన్ఫర్మ్ అవగా మే 31న ఈ సినిమా ముహూర్తం పెట్టుకుంటారని తెలుస్తుంది. 2021 సమ్మర్ టార్గెట్ తో ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారని ఫిల్మ్ నగర్ టాక్.