పవన్ కోసం ఇలియానా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు రాగా ఆమె ఎందుకో పవన్ సరసన నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తుంది. అందుకె శృతి బదులుగా మరో స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఆ రేసులో గోవా బ్యూటీ ఇలియానా ఉందని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్,ఇలియానా కలిసి జల్సా సినిమాలో నటించారు. ఇద్దరిది సూపర్ హిట్ పెయిర్.. తెలుగులో టాప్ రేంజ్ కు వెళ్లిన ఇలియానా బాలీవుడ్ మీద ఆశతో వెళ్లి అక్కడ ఇక్కడ ఛాన్సులు పోగొట్టుకుంది. కొన్నాళ్ళు రష్యన్ ఫోటోగ్రాఫర్ తో ప్రేమాయణం నడిపించిన ఇలియానా ప్రస్తుతం అతని నుండి దూరంగా ఉంటుందని తెలుస్తుంది. తెలుగులో ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న అమ్మడికి రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ సినిమా కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో ఇలియానాని సెలెక్ట్ చేశారని అంటున్నారు. సినిమాలకు దూరమైనప్పుడు కొద్దిగా బొద్దుగా మారిన ఇల్లి బేబీ యిప్పుడు మళ్ళీ స్లిమ్ లుక్ కోసం ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. పవన్ ఛాన్స్ కనుక వస్తే మాత్రం ఇలియానా మళ్ళీ తెలుగులో వరుస అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉంది.