ఒక్కడులో 'ఓబుల్ రెడ్డి' గోపీచంద్..?

సూపర్ స్టార్ మహేష్ గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఒక్కడు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎమ్మెస్ రాజు ఈ సినిమా నిర్మించిన ఈ సినిమా అప్పటివరకు మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మహేష్, భూమికల జోడీ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో విలన్ ఓబుల్ రెడ్డి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించి మెప్పించారు. అయితే ఈ సినిమాలో ఓబుల్ రెడ్డి పాత్రకు మొదట ప్రకాష్ రాజ్ ను అనుకోలేదట. 

హీరో గోపీచంద్ ను ఓబుల్ రెడ్డి పాత్రలో తీసుకోవాలని అనుకున్నారట. అయితే అప్పటికే మహేష్ నటించిన నిజం సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించాడు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవలేదు. అందుకే మహేష్ ఆ ఒక్కడు సినిమాకు గోపీచంద్ విలన్ అని చెప్పగానే అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదట. మహేష్ నిర్ణయానికి గౌరవం ఇచ్చిగోపీచంద్ బదులుగా ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు. ఒక్కడు సినిమాలో ప్రకాష్ రా చేసిన ఓబుల్ రెడ్డి పాత్రలో ఆయన్ను తప్ప వేరే వాళ్ళను ఊహించుకోలేం అన్నట్టుగా చేశాడు. మహేష్, ప్రకాష్ రాజ్ ల కెరియర్ కు ఆ సినిమా టర్నింగ్ పాయింట్ అయ్యింది.