ప్రభాస్ కోసం దీపికా పదుకొనే..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తర్వాత చేస్తున్న సినిమా ఓ డియర్ (ప్రచారంలో ఉన్న టైటిల్). జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ మహానటి డైరక్టర్ నాగ్ అశ్విన్ తో ఒక భారీ మూవీ ప్లాన్ చేశారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. టైం ట్రావెల్ కథా నేపథ్యంతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఇక సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనేని తీసుకునే అవకాశాలు ఉన్నాయట.  

బాహుబలి తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్నాడు. ప్రస్తుతం చేస్తున్న రాధాకృష్ణ సినిమా కూడా అదే రేంజ్ లో రిలీజ్ అవుతుంది. ఇక నాగ్ అశ్విన్ సినిమా కూడా అంతే గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారట. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో దీపికా హీరోయిన్ అయితే సినిమా రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.