
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఫ్యామిలీ ట్రాక్ కోసం శృతి హాసన్ ను ఎంపిక చేసినట్టు ఎనౌన్స్ చేశారు. దానికి సంబందించిన అగ్రిమెంట్ కూడా పూర్తి చేసుకున్నారని అన్నారు. అయితే శృతి హాసన్ మాత్రం వకీల్ సాబ్ లో తాను నటించట్లేదని చెబుతుందట. శృతి ఆడుతున్న ఈ డబుల్ గేమ్ మేకర్స్ ను ఇరకాటంలో పడేస్తుందని తెలుస్తుంది.
కొద్దిపాటి గ్యాప్ తో రవితేజ క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న శృతి హాసన్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో కూడా నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే వకీల్ సాబ్ మీద శృతి హాసన్ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తుంది. ఇంతకుముందు ఊపిరి సినిమా టైం లో కూడా శృతి హాసన్ ఇలాంటి పనులే చేసి ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చింది. ఆమె ప్లేస్ లో చివరకు తమన్నాని తీసుకున్నారు. మరి చేస్తే చేస్తానని.. కుదరకపోతే చేయనని చెప్పాలి కానీ శృతి హాసన్ చేస్తున్న పనుల వల్ల ఆమెకు బ్యాడ్ నేమ్ వస్తుంది.