
రైటర్ గా కెరియర్ మొదలుపెట్టి డైరక్టర్ గా మారి వరుస హిట్లు కొడుతున్న కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న ఆచార్య సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. 40 శాతం వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఉన్నట్టు చెప్పారు కొరటాల శివ. అంతేకాదు తాను మరో ఐదేళ్ల వరకే సినిమాకు చేస్తానని.. తన ప్లేస్ లో కొత్తవాళ్లను ఆహ్వానిస్తానని.. అప్పుడే మంచి సినిమాలు వస్తాయని అన్నారు కొరటాల శివ.
ఈ ఐదేళ్ళలో తను తీయాలన్న సినిమాలు తీస్తానని చెప్పుకొచ్చారు కొరటాల శివ. ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది ఇప్పుడే చెప్పలేనని.. కథ రాసుకున్నాక ఆ కథకు తగిన హీరోని ఎంచుకుంటానని అన్నారు కొరటాల శివ. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా ఉన్నారని చెప్పిన కొరటాల శివ సినిమాలో చరణ్ కు జోడిగా ఎవరు నటిస్తారన్నది ఇంకా నిర్ణయించలేదని అన్నారు.