
ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న లేటెస్ట్ రూమర్ డైరక్టర్ నందిని రెడ్డి, సమంత చైతు కాంబినేషన్ లో సినిమా.. చైతు, సమంత ఐదోసారి జంట కట్టబోతున్నారు. అయితే ఈ సినిమా విషయంలో నందిని రెడ్డి రూమర్స్ కు బ్రేక్ చేశారు. నందిని రెడ్డి ఈసారి కూడా సమంతతో ఒక రీమేక్ సినిమా చేస్తుందని అంటున్నారు. అయితే ఈ రూమర్ అటు తిరిగి ఇటు తిరిగి నందిని రెడ్డి దాకా వెళ్ళింది.
సమంతతో తాను కొత్త కథతో సినిమా చేస్తున్నాను. ఈ రూమర్ కు తానూ 1/5 రేటింగ్ ఇస్తున్నా అని సినిమా రేటింగ్ లానే గాసిప్ కు 1/5 అంటూ గాసిప్ రేటింగ్ ఇచ్చేసింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ వార్తలపై ఒక సెటైర్ కూడా వేసింది నందిని రెడ్డి. లాస్ట్ ఇయర్ ఓ బేబీతో సూపర్ హిట్ అందుకున్న నందిని రెడ్డి, సమంత మరోసారి కలిసి చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా నాగ చైతన్య నటిస్తాడని తెలుస్తుంది.