
విజయ్ దేవరకొండ సందీప్ వంగ కాంబినేషన్ లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి ఎంతటి సంచలన విజయం అందుకుందో తెలిసిందే. 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 30 కోట్ల పైగా వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాతో విజయ్ కు సూపర్ క్రేజ్ రాగా అందులో హీరోయిన్ గా నటించిన షాలిని పాండే మాత్రం కెరియర్ లో వెనుకపడ్డది. అర్జున్ రెడ్డితో హిట్టు పడినా ఆమె సినిమాల సెలక్షన్ లోపం వల్ల అనుకున్నంత క్రేజ్ తెచ్చుకోలేదు.
మహానటి, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాల్లో చిన్న పాత్రలతో అలరించిన షాలిని పాండే మళ్ళీ తెలుగులో మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. సినిమాల్లో ఎలా ఉన్నా బయట మాత్రం షాలిని పాండే చాలా తెలివిగల అమ్మాయినే తెలుస్తుంది. అందుకే అప్పుడప్పుడు కొన్ని మెసేజులు కూడా ఇస్తుంది. లేటెస్ట్ గా నీ మీద అధికారం చెలాయించే అవకాశం ఎవరికీ ఇవ్వొద్దు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటె అంత మంచిది అంటూ చెప్పుకొచ్చింది షాలిని పాండే. మరి అమ్మడు ఇలా అనడానికి గల కారణం ఏంటో తెలియాల్సి ఉంది.