'మెగా' ఫ్యామిలీ అనిపించుకున్నారు..!

కరోనాపై ఇంట్లోనే ఉంది యుద్ధం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబం అంతటితో ప్లకార్డులతో స్పెషల్ షో చేశారు. ఇంటోనే ఉంటాం.. యుద్ధం చేస్తాం.. క్రిమిని కాదు ప్రేమని పంచుతాం.. కాలు కదపకుండా కరోనాని తరిమేస్తాం.. భారతీయులం ఒకటై.. భారత్ ను గెలిపిస్తాం.. స్టే హోమ్ అంటూ చిరు తన ఫ్యాఅమిలీతో కలిసి ఈ స్పెషల్ సర్ ప్రయిజ్ చేశారు. కరోనాని పారద్రోలేందుకు మనమంతా ఇళ్లలోనే ఉండాలని చెబుతూ మెగా ఫ్యామిలీ మొత్తం కదిలివచ్చింది. 

చిరు కోరడం వల్లే మెగా ఫ్యామిలీ మొత్తం కరోనా గురించి అవగాహన కలిగించేలా ప్లకార్డులుతో కనిపించారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ స్టే హోమ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా, అల్లు ఫ్యామిలీ అందరు ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు మిస్ అయ్యారు. లాక్ డౌన్ టైం లో ప్రజలకు ఉపయోగపడేలా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న చిరుని అందరు మెచ్చుకుంటున్నారు.