
యువ హీరో సందీప్ కిషన్ కార్తీక్ నరేన డైరక్షన్ లో తమిళంలో తెరకెక్కించిన సినిమా నరకాసురన్. తెలుగులో ఈ సినిమాను నరకాసురుడు టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా రిలీజ్ కు నోచుకోని ఈ మూవీ మార్చి 27న రిలీజ్ ఫిక్స్ చేశారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా థియేటర్లు బంద్ చేశారు. లాక్ డౌన్ ఎత్తేసినా రిలీజ్ ఆగిపోయిన సినిమాలన్నీ వరుసగా రిలీజ్ అవుతాయి. అందుకే సందీప్ కిషన్ నరకాసురుడు సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు.
ఏప్రిల్ 17న అమెజాన్ లో నరకాసురుడు స్ట్రీమింగ్ అవుతుంది. లాక్ డౌన్ వల్ల అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా, సన్ నెక్స్ట్ లాంటి ఓటిటి ఫ్లాట్ ఫామ్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రధాని కూడా మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించారు కాబట్టి ఈమధ్యలో మరికొన్ని సినిమాలు డిజిటల్ లో రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారు. సందీప్ కిషన్ మూవీ అమెజాన్ లో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.