
ఆర్.ఆర్.ఆర్ అనుకున్న టైం కు వస్తుందా..? ఒకసారి రిలీజ్ డేట్ వాయిదా వేసిన రాజమౌళి మళ్ళీ ట్రిపుల్ ఆర్ ను వాయిదా వేస్తాడా..? 2021 జనవరి 8 ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఉంటుందా ఉండదా అన్న ప్రశ్నలకు సమాధానం ఇంకా తెలియలేదు. అయితే రిలీజ్ డేట్ పై వస్తున్నా రూమర్స్ ను పక్కన పెట్టి సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. అదేంటి లాక్ డౌన్ టైం లో సినిమా పనులు ఎలా జరుగుతాయని అనుకోవచ్చు. అక్కడ ఉంది రాజమౌళి కదా లాక్ డౌన్ టైం ను సినిమాకు వాడేస్తున్నాడు.
ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో అయినంతవరకు సినిమాకు డబ్బింగ్ చెప్పేస్తున్నాడు జక్కన్న. అందుకు కావాల్సిన క్వాలిటీ మైకులను ఇప్పటికే చరణ్, తారక్ ల ఇళ్లకు పంపించాడట. ఇంట్లోనే ఉంటూ డబ్బింగ్ చెబుతున్నారట ఈ ఇద్దరు స్టార్స్. మరోపక్క కీరవాణి కూడా ఆర్.ఆర్.ఆర్ కు కావాల్సిన సాంగ్స్ ను కంపోజ్ చేస్తున్నారట. మొత్తానికి లాక్ డౌన్ టైం లో మిగతా సినిమాలు ఆగిపోయినా ఆర్.ఆర్.ఆర్ వర్క్ మాత్రం జరుగుతూనే ఉందని తెలుస్తుంది.