
టాక్సీవాలా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాహుల్ సంకృత్యన్ తన నెక్స్ట్ సినిమా నాచురల్ స్టార్ నానితో ఫిక్స్ చేసుకున్నాడు. శ్యామ్ సింగ రాయ్ టైటిల్ పోస్టర్ తో సినిమాపై ఆసక్తి పెంచిన ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. ఈ మూవీలో నాని సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ మూవీకి మ్యూజిక్ గా ముందు ఏ.ఆర్ రహమాన్ పేరు ఎనౌన్స్ చేయగా ఆయన చేయనని చెప్పేసరికి అనిరుద్ రవిచంద్రన్ ను మ్యూజిక్ డైరక్టర్ గా అనుకున్నారు.
అయితే లేటెస్ట్ గా థమన్ ని ఈ సినిమా మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. సితార, హారిక హాసిని తమన్ మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు. అందుకే థమన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే నాని మాత్రం అనిరుద్ కె ఓటు వేస్తున్నట్టు తెలుస్తుంది. నాని జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలకు అనిరుద్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. అందుకే నాని అనిరుద్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ఐటీ అనిరుద్ మ్యూజిక్ బాగా ఇస్తున్నా అతను చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ అందుకోలేదు. అందుకే మ్యూజిక్ డైరక్టర్ విషయంలో మేకర్స్ మరోసారి ఆలోచనలో పడ్డారట. మరి శ్యామ్ సింగ రాయ్ కు ఫైనల్ మ్యూజిక్ డైరక్టర్ ఎవరన్నది ఎవరో త్వరలో తెలుస్తుంది.