
ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ మరోసారి త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అరవింద సమేత సినిమాతో మొదటిసారి కలిసి పనిచేసిన త్రివిక్రమ్, తారక్ మరో ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు టైటిల్ గా అయినాను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో త్రివిక్రమ్ రాసుకున్న ఈ కథతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు త్రివిక్రమ్.
ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకునే ఛాన్సులు ఉన్నట్టు తేలుతుంది. సంజయ్ దత్ రేంజ్ విలన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడు అంటే తప్పకుండా తారక్ కోసం మరో అద్భుతమైన కథ రాసుకుని ఉంటాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ కు సంజయ్ దత్ లాంటి పవర్ ఫుల్ విలన్ ఢీ కొడితే ఆ కిక్కు వేరేలా ఉంటుంది. త్వరలో ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ న్యూస్ బయటకు వస్తుందని తెలుస్తుంది.