
ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను సక్సెస్ చేసేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తప్పనిసరి అయితేనే కానీ ఇంట్లో నుండి బయటకు రావొద్దని చెబుతున్నారు. అయితే ప్రజల కోసం డాక్టర్లతో పాటుగా పోలీసులు కూడా పగలు రాత్రి అనే తేడా లేకుండా తమ డ్యూటీ చేస్తున్నారు. అయితే పోలీసులను ఉత్తేజపరచడానికి హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజన్ కుమార్, సినీ హీరో విజయ్ దేవరకొండతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.
పోలీస్ అన్నలందరికి నమస్కారం అంటూ రెండు చేతులు పైకెత్తి విజయ్ నమస్తే చెప్పారు.. అందరు బాగున్నారా అని అడిగి తెలుసుకుని బాగుంటే థమ్స్ అప్ చూపించాడని అన్నారు. కమీషనర్ ఆఫీస్ లో.. పోలీస్ కమీషనర్ పక్కన కూర్చుని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతానని అసలు అనుకోలేదని అన్నారు విజయ్ దేవరకొండ. కమీషనర్ ఆఫీస్ కు వస్తుంటే ప్రతి షాప్ మూసి వేసి ఉంది.. రోడ్లు ఖాళీగా ఉన్నాయి. ఒకే ఒక్క బ్యాచ్ కనిపిస్తుంది. అది పోలీస్ వాళ్ళు మాత్రమే.. సైట్ అత్తా షట్ డౌన్ ఉన్నా ప్రతి కిలోమీటర్ కు బారికేడ్లు, పోలీసులు కనిపిస్తున్నారు. మీరంతా 8 నుండి 12 గంటల పాటు షిఫ్టుల్లో పనిచేస్తున్నారని తెలుస్తుంది. మేమంతా ఇళ్లలో ఉండటానికి మీరంతా పనిచేయాల్సి వస్తుంది.
ఇన్ని రోజులు నేను బయటకు రాలేదు.. ఇంట్లో ఉండటం వల్లే పెద్ద హెల్ప్ చేస్తున్నానని భావించా.. కానీ మళ్ళీ ఈ లాక్ డౌన్ పెరగడంతో మీరు చేసే పని ఎంత పెరిగింది. మీరెంత కష్టపడుతున్నారో నాకు కమీషనర్ గారు చెప్పాక అర్ధమైంది. ఈ లాక్ డౌన్ పూర్తయ్యేంత వరకు పోలీస్ వారికి నా పూర్తి సహకారం ఉంటుంది. కమీషనర్ గారు ఎప్పుడు పిలిచినా వస్తానని అన్నారు విజయ్ దేవరకొండ. ఒక పౌరుడిగా పోలీస్ ఫోర్స్ కు అండగా ఉండాల్సిన బాధ్యత నాపై ఉందని అన్నారు.