
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చి అంచనాలను మించి వసూళ్లను రాబట్టిన సినిమా అల వైకుంఠపురములో. నా పేరు సూర్య తర్వాత కొడితే సూపర్ హిట్టు కొట్టాలన్న బన్ని కసితో చేసిన సినిమా ఇది. త్రివిక్రమ్ కూడా తన పెన్ పవర్ చాటిన ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టింది. తెలుగులో ఒక సినిమా హిట్ అయితే బాలీవుడ్, కోలీవుడ్ లో రీమేక్ ఆఫర్లు రావడం కామన్. అల వైకుంఠపురములో కూడా హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అవుతున్నట్టు తెలుస్తుంది.
హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తాడని తెలుస్తుండగా.. తమిళంలో ఈ సినిమాను శివ కార్తికేయన్ చేస్తాడని అంటున్నారు. అల వైకుంఠపురములో తమిళ రీమేక్ పై నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగు వర్షన్ చెన్నైలో మంచి వసూళ్లను రాబట్టింది. అందుకే తమిళ ఆడియెన్స్ కు ఈ సినిమా అందించాలని చూస్తున్నారు. మరి అల వైకుంఠపురములో తమిళ రీమేక్ ఆడియెన్స్ ను ఈమేరకు మెప్పిస్తుందో చూడాలి.