లవ్ స్టోరీస్ పై నోరు విప్పిన నయనతార..!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న నయనతార అక్కడ తన సినిమాలతో స్టార్స్ కు సైతం పోటీ వచ్చే పరిస్థితి ఏర్పడింది. తెలుగులో కూడా సీనియర్ స్టార్స్ కు ఆమె మొదటి ఆప్షన్ అని చెప్పొచ్చు. సినిమాలతో ఎంత పాపులారిటీ తెచ్చుకుందో లవ్ ఎఫైర్స్ తో కూడా నయన్ అంత ఫేమస్ అయ్యింది. మొదట్లో శింబుతో ప్రేమ వ్యవహారం సీక్రెట్ పిక్స్ లీక్ అయ్యేదాకా చేసింది. శింబుతో కటీఫ్ చేసుకుని ప్రభుదేవాతో అమ్మడి లవ్ స్టోరీ నడిపించింది. 

ప్రభుదేవా నుండి కూడా విడిపోయి కొన్నాళ్ళు పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టి ఫైనల్ గా డైరక్టర్ విఘ్నేష్ శివన్ తో లవ్ లో ఉంది. అయితే తన లవ్ స్టోరీస్ గురించి మాట్లాడటానికి ఇష్టపడని నయనతార లేటెస్ట్ ఇంటర్వ్యూలో వాటి గురించి నోరి విప్పింది. నమ్మకం లీ చోట ఎలాంటి బంధం నిలబడదు అందుకే తన రెండు ప్రేమ కథలు అర్ధాంతరంగా ముగిశాయని చెప్పుకొచ్చింది నయనతార. అయితే నమ్మకం ఎవరి మీద ఎవరికీ అని అడిగే ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు. అయితే ఒక హీరో, ఒక డైరక్టర్ తో ప్రేమాయణం నడిపించిన నయనతార ప్రస్తుతం డైరక్టర్ విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. అతన్నే త్వరలో పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తుంది.