ప్రగతి ఆంటీ తీన్మార్ డ్యాన్స్..!

లాక్ డౌన్ టైం లో ఇంట్లో ఉంటున్న సినీ స్టార్స్ తమలోని కొత్త కొత్త టాలెంట్ తో ప్రేక్షకులను సర్  ప్రయిజ్ చేస్తున్నారు. హీరోలు, హీరోయిన్లు అనే తేడా లేకుండా అందరు తమలోని న్యూ టాలెంట్ తో అదరగొడుతున్నారు. అందరు ఏమో కానీ టాలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి చేసిన తీన్మార్ డ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాల్లో మదర్ రోల్స్ చేస్తూ అలరించే ప్రగతి తనలోని ఈ మాస్ యాంగిల్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచింది. 

లుంగీ కట్టుకుని మరి తీన్మార్ డ్యాన్స్ చేసిన ప్రగతి పక్కన తన కొడుకుతో సమానంగా అదరగొట్టింది. ఎన్టీఆర్ బాద్షా సినిమాలో జస్ట్ అలా కాలు కదిపిన ప్రగతి తన ఒరిజినల్ టాలెంట్ ఏంటో చూపించింది. క్వారెంటైన్ టైం లో ప్రగతి చేసిన ఈ డ్యాన్స్ వీడియో అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఆమెలోని ఈ యాంగిల్ అందరు వాడుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రగతి చూసేందుకు చాలా క్లాస్ గా అనిపించినా ఆమె డ్యాన్స్ చూస్తే మాత్రం అదరహో అనిపిస్తుంది.