
మెగాస్టార్ చిరంజీవి తన సినిమా స్పీడ్ పెంచారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ తర్వాత సైరా నరసింహా రెడ్డి సినిమా చేశాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్న చిరు ఆ తర్వాత లూసిఫర్ రీమేక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా రీమేక్ ను సుజిత్ డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. ఇక ఈ మూవీ తర్వాత చిరు కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.
రీసెంట్ గా చిరుని కలిసి బాబీ కథ చెప్పాడట. స్టోరీ లైన్ నచ్చడంతో సినిమా కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. చిరుతో బాబీ ఈ ప్రాజెక్ట్ 2021 మిడిల్ లో స్టార్ట్ అయ్యేట్టు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రైటర్ గా కెరియర్ ప్రారంభించి పవర్ సినిమాతో దర్శకుడిగా మారిన బాబీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్లాప్ తో కెరియర్ లో చాలా వెనుకపడ్డాడు. మళ్లీ ఎన్టీఆర్ జై లవ కుశతో ఫామ్ లోకి వచ్చాడు బాబీ. ఆ తర్వాత వెంకీమామతో లాస్ట్ ఇయర్ చివర్లో హిట్ కొట్టాడు. కథను డీల్ చేయడంతో సూపర్ అనిపించుకున్న కె.ఎస్ రవీంద్ర మెగాస్టార్ తో ఎలాంటి మూవీ చేస్తాడో చూడాలి.