
నాచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా వి. నాని నెగటివ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. సినిమాలో నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటించగా సినిమా మార్చ్ 25న రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ రిలీజ్ టైం లో లాక్ డౌన్ ఎఫెక్ట్ పడ్డది. ఏప్రిల్ మొత్తం కూడా లాక్ డౌన్ ఉండగా సినిమాకు అమెజాన్ నుండి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.
లాక్ డౌన్ ఎన్నిరోజులు పొడిగిస్తారో తెలియదు అందుకే నాని వి సినిమాకు అమెజాన్ నుండి 35 కోట్ల ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. డైరెక్ట్ గా ఆన్ లైన్ లో రిలీజ్ చేసేలా డీల్ వచ్చిందట. అయితే నాని వి యూనిట్ మాత్రం ఈ ఆఫర్ ను తిరస్కరించిందని తెలుస్తుంది. ఇప్పటికే తమిళ సినిమాలు కొన్ని డైరెక్ట్ గా ఆన్ లైన్ లో రిలీజ్ అవుతున్నాయి. శివ కార్తికేయ శక్తి సినిమా అమెజాన్ లో రిలీజ్ చేశారు. వి కూడా అలానే రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ లేట్ అయినా కూడా ఆన్ లైన్ లో రిలీజ్ మాత్రం చేసేది లేదని చెప్పారు నిర్మాత దిల్ రాజు.