లాక్ డౌన్ టైంలో లాక్ చేసేస్తుందిగా..!

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న నిధి అగర్వాల్ కెరియర్ లో మొదటి హిట్ తో ఫుల్ జోష్ లో ఉంది. అంతకుముందు తెలుగులో చేసిన సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇస్మార్ట్ హిట్ తో నిధి అగర్వాల్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే ఇప్పుడు అమ్మడు వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం క్వారెంటైన్ టైం లో అందరి హీరోయిన్స్ తో పాటుగా తమలోని కుకింగ్ టాలెంట్ చూపిస్తున్న నిధి అగర్వాల్ దానితో పాటుగా అందాలతో కూడా లాక్ చేస్తుంది. 

హాట్ లుక్స్ తో ఆకట్టుకునే నిధి అగర్వాల్ లాక్ డౌన్ టైం లో కూడా అందాలతో అదరగొడుతుంది. ఎప్పుడు దిగిందో ఏమో కానీ నిధి తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫోటో ఒకటి అప్లోడ్ చేసింది. అమ్మడు ఇలా పెట్టిందో లేదో అలా వైరల్ అయిపొయింది. లాక్ డౌన్ టైం లో అందాలతో లాక్ చేస్తున్న నిధి అగర్వాల్ వరుసగా హిట్లు పడితే మాత్రం ఇంకాస్త రెచ్చిపోయే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. టాలీవుడ్ లో మూడు సినిమాలు చేసిన ఈ అమ్మడు ఒక సినిమా హిట్ కొడితేనే ఈ రేంజ్ పాపులారిటీ తెచ్చుకుంది అంటే మరో రెండు హిట్లు పడితే మాత్రం స్టార్ రేసులో ఉండే అవకాశం ఉంది.