టబు టూ రమ్యకృష్ణ వయా అనసూయ..!

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అందాదున్ తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. మేర్లపాక గాంది డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన మరోసారి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. హిందీలో టబు పాత్ర హైలెట్ గా నిలిచింది. ఆ పాత్రకు తెలుగులో కూడా ఆమెనే తీసుకోవాలని అనుకున్నారు కానీ టబు రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పడంతో ఆమె బదులుగా బుల్లితెర హాట్ యాంకర్ అనసూయని ఆ పాత్రలో తీసుకోవాలని నిర్ణయించారు. 

అయితే అనసూయ కూడా ఆ పాత్ర చేసేందుకు సుముఖంగా లేదని తెలియడంతో ఫైనల్ గా రమ్యకృష్ణ ఆ పాత్రకుఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. శివగామి పాత్రలో మరోసారి తన సత్తా చాటిన రమ్యకృష్ణ బాహుబలి తర్వాత మళ్ళీ కెరియర్ జోష్ అందుకుంది. ఇక ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ అలరిస్తున్న ఈ అమ్మడు అందాదున్ తెలుగు రీమేక్ లో కూడా ఛాన్స్ పట్టేసింది అంటున్నారు. ఈ సినిమాకు సంబందించిన పూర్తి డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.