
లాక్ డౌన్ కారణంగా ఇళ్లల్లోనే ఉంటూ సినీ తారలు తమ ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. హీరోలు, హీరోయిన్స్ అనే తేడా లేకుండా ఇంట్లో వారి కొత్త టాలెంట్ చూపిస్తున్నారు. రీసెంట్ గా ఇండియన్ సూపర్ స్టార్స్ అంటా కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అమితాబ్ కళ్ళజోడు కనబడకుండా పోవడం తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ పరిశ్రమలకు సంబందించిన స్టార్స్ అంతా కళ్లద్దాలు గురించి మాట్లాడటం.. ఫైనల్ గా ప్రియాంకా వచ్చి ఆ గాగుల్స్ అమితాబ్ కు ఇవ్వడం జరుగుతుంది.
ఇదంతా ఎవరికీ వారు ఇళ్లల్లో ఉండి.. తమ మొబైల్ తో తీసినవే. ఫైనల్ గా ఎడిట్ చేస్తే ఓ సూపర్ హిట్ షార్ట్ ఫిల్మ్ గా తయారైంది. ఇక ఇప్పుడు బుల్లితెర స్టార్స్ కూడా ఇలాంటి ఒక ప్రయత్నమే చేశారు. తెలుగులో నటించే బుల్లితెర స్టార్స్ అంతా కలిసి రవి బయటకు వెళ్లడాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. నువ్వొక్కడివే బయటకు వెళ్తే కుటుంబం మొత్తం బాధపడాల్సి వస్తుందని చెబుతూ అందరు సీరియల్ స్టార్స్ కలిసి ఈ షార్ట్ ఫిలిం చేశారు.. ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్ గా బాలసుబ్రహ్మణ్యం, పరుచూరి గోపాలకృష్ణ కూడా కనిపించారు.
పుట్టడానికి 9 నెలలు ఓపిక పట్టావ్.. బ్రతకడానికి కొన్ని రోజులు ఓపిక పట్టలేవా అంటూ బాలు గారు చెప్పిన డైలాగ్ బాగా టచ్ అయ్యింది. స్మాల్ స్క్రీన్ స్టార్స్ అంటా చేసిన ఈ చిరు ప్రయత్నాన్ని ప్రేక్షకులు అభినందిస్తున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ లో 34 మంది సౌత్ స్మాల్ స్క్రీన్ ఆర్టిస్టులు.. 29 హౌజెస్ లో.. 29 కెమెరాలు.. 5 భాషల్లో వచ్చింది.