సాక్స్ తో మాస్క్.. రవిబాబు ప్లాన్ అదిరింది..!

లాక్ డౌన్ టైంలో బయటకు వెళ్లని పరిస్థితి ఉంది. బయటకు వెళ్లే అవసరం పడితే మాస్క్ వేసుకోవడం కంపల్సరీ అయితే మాస్క్ లన్ని షార్టేజ్ కాగా ఇంట్లోనే మాస్క్ ను తయారు చేసుకునేలా సలహాలు ఇస్తున్నారు సినీ సెలబ్రిటీస్. ఇదివరకే ఉపాసన లాంటి వారు ఇంట్లో మాస్క్ తయారీ గురించి చెప్పగా లేటెస్ట్ గా నటుడు దర్శకుడు రవిబాబు కూడా ఇంట్లో మాస్క్ తయారీ చేసుకోండని సింపుల్ ప్రాసెస్ చెప్పారు. ఇంట్లోనే సాక్స్ లతో మాస్క్ తయారు చేసుకోవడం ఎలానో చూపించారు రవిబాబు. 

సాక్స్ ను రెండుగా కట్ చేసి పై భాగాన్ని రెండు వైపులా సగానికి పైగా కట్ చేస్తే చాలు మాస్క్ రెడీ అంటున్నారు రవిబాబు. ఈ మాస్క్ తో పాటుగా గాగుల్స్ పెడితే చాలా స్టైల్ గా ఉంటుందని అంటున్నారు రవిబాబు. రవిబాబు చెప్పిన సలహా బాగానే ఉంది. కాకపోతే కొత్త సాక్స్ లతోనే ఈ మాస్క్ తయారు చేసుకోవాలి. సాక్స్ లు ఇంట్లో ఉన్నట్లయితే ఈ మాస్క్ తయారు చేసుకుని బయటకు వెళ్లేప్పుడు మాస్క్ కట్టుకుని వెళ్ళండి అంటున్నాడు రవిబాబు. మొత్తానికి రవిబాబు ఇచ్చిన ఈ సలహా ఎంతమంది ఫాలో అవుతారో చూడాలి.