తెలుగు లూసిఫర్ డైరక్టర్ అతనేనా..?

మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ మూవీ తెలుగులో మెగాస్టార్ రీమేక్ చేస్తాడని వార్తలు వచ్చాయి. కొణిదెల ప్రొడక్షన్స్  ఆల్రెడీ ఆ సినిమా రీమేక్ హక్కులు సొంతం చేసుకుంది. చిరంజీవి ఈ సినిమాలో నటిస్తారని ఫిల్మ్ నగర్ టాక్. ఐతే ఈ మూవీ డైరక్షన్ ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో తెలియాల్సి ఉంది. అయితే ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లు ప్రచారంలో ఉండ గా ఫైనల్ గా సాహో డైరక్టర్ సుజిత్ పేరు ఫిక్స్ చేశారట.  

సూపర్ హిట్టైన ఈ సినిమా తెలుగు వర్షన్ లో కొన్ని చేంజెస్ చేస్తున్నారట. రన్ రాజా రన్, సాహో సినిమాలతో టేకింగ్ పరంగా సూపర్ అనిపించుకున్న సుజిత్ సరైన కథ దొరికితే అదరగొట్టేస్తాడని చెప్పొచ్చు. అందుకే లూసిఫర్ కథని సుజిత్ పర్ఫెక్ట్ గా డీల్ చేస్తాడని అతనికి ఛాన్స్ ఇస్తున్నారట. సాహో తర్వాత సుజిత్ కొద్దిపాటి గ్యాప్ తీసుకున్నా మెగా ఛాన్స్ పట్టేశాడని తెలుస్తుంది. మరి సుజిత్ లూసిఫర్ రీమేక్ సినిమాపై మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.