పుష్ప కోసం బాలీవుడ్ భామ

అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత ఫుల్ జోష్ లో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ టోన్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేసిన సుక్కు అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా స్క్రిప్ట్ రాసుకున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో రష్మికకు మంచి రోల్ దక్కిందని తెలుస్తుంది. 

ఇక ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతులాని తీసుకోవాలని అనుకుంటున్నారు. బాలీవుడ్ లో హాట్ ఫోటో షోలతో ఆడియెన్స్ ను అలరిస్తున్న ఊర్వశి బన్ని పుష్ప కోసం సౌత్ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్నదని తెలుస్తుంది. సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మరి ఊర్వశితో స్పెషల్ సాంగ్ అంటే కచ్చితంగా సినిమా దుమ్ముదులిపేయడం ఖాయం. 

ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో బన్ని ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. రంగస్థలంతో నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టిన సుకుమార్ ఈ సినిమాతో బాహుబలి రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నారు. అందుకే సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు.