ట్రిపుల్ ఆర్ మళ్ళీ వాయిదా..?

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా అసలైతే ఈ ఇయర్ జూలై 30న రిలీజ్ అనుకున్నారు. షూటింగ్ గ్యాప్ రావడం అనుకున్న టైంకు షెడ్యూల్ పూర్తి చేయకపోవడంతో ఈ ఇయర్ అనుకున్న రిలీజ్ కాస్త 2021 జనవరి 8కి వాయిదా వేశారు. అయితే కరోనా వల్ల షూటింగ్ మళ్ళీ మూడు నాలుగు నెలలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.    

అందుకే ఆర్.ఆర్.ఆర్ మళ్ళీ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే రాజమౌళి ఈ సినిమా రిలీజ్ డేట్ అఫీషియల్ గా వెళ్లడిస్తారని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాతో మరోసారి తెలుగు సినిమా సత్తా చాటాలని చూస్తున్నాడు రాజమౌళి.