స్టార్ హీరో సినిమాలకు గుడ్ బై..?

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళంతో పాటుగా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విక్రమ్ ప్రస్తుతం కోబ్రా, ధ్రువ నక్షత్రం సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే విక్రమ్ ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి తన వారసుడు ధృవ్ ని స్టార్ చేసే ప్రయత్నాల్లో ఉంటాడని అంటూ వార్తలు వచ్చాయి. 

అయితే విక్రమ్ సినిమాలకు గుడ్ బై చెబుతాడన్న వార్తలపై స్పందించారు విక్రమ్ ఫై.ఆర్ టీం. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తారంటూ కోలీవుడ్ మీడియాపై ఫైర్ అయినట్టు తెలుస్తుంది. తెలుగులో శివపుత్రుడు, అపరిచితుడు సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విక్రమ్ ఈమధ్య చేస్తున్న సినిమాలన్నిం తమిళంతో పాటుగా తెలుగులో రిలీజ్ అవుతున్నా సరే ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోవడం లేదు. ఎవరో కావాలని విక్రమ్ పై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆ హీరో పి.ఆర్ టీం మండిపడుతుంది. ఇకమీదట తమ హీరోపై ఇలాంటి వార్తలు వస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.