
లాక్ డౌన్ టైం లో హీరోయిన్స్ అందరు ఎప్పుడు చేయని ప్రయోగాలు చేస్తున్నారు. సినిమా షూటింగులతో బిజీగా ఉన్న టైం లో కనీసం వంటగదిని చూడటానికి కూడా టైం దొరకని భామలంతా ఇప్పుడు స్వయంపాకం చేసుకుంటున్నారు. రీసెంట్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్డే తాను చేసిన హల్వా సూపర్ అంటూ హల్వాతో పాటుగా థై షో కూడా చేయగా లేటెస్ట్ గా కాజల్ అగర్వాల్ కూడా తాను చేసిన సమోసా సూపర్ అంటూ చెప్పుకొచ్చింది.
పంజాబీ స్టైల్ సమోసా చేసిన కాజల్ తన సోషల్ బ్లాగ్ లో ఆ విషయాన్ని వెళ్లడించింది. ఎంతైనా హీరోయిన్ కదా అందుకే అమ్మడు చేసిన సమోసాలు సూపర్ క్రేజ్ ఏర్పడింది. కాజల్ చేసిన సమోసాలు సువాసన సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది. లాక్ డౌన్ వల్ల అందరు తమలో దాగి ఉన్న కొత్త టాలెంట్ బయటకు తీస్తున్నారు. కాజల్ చేసిన సమోసాలు క్రేజ్ ఎలా ఉంది అంటే.. మీరు చేసి పెట్టండి మేము అమ్మి పెడతాం అని ఆన్ లైన్ లో హాట్ డీల్స్ వచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు. సమోసా అంటే కాజల్ గుర్తొచ్చేలా చేస్తుంది కాజల్ అగర్వాల్. పెళ్లి తర్వాత తన భర్తకు ఫుడ్ విషయంలో ఎలాంటి లోటు లేకుండా చేసుకునేలా చేస్తుందేమో చూడాలి.