మహేష్ పుష్ప రాజ్.. అబ్బో కష్టమే బాసు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే నాడు పుష్ప ఫస్ట్ లుక్ సెన్సేషన్ గా మారింది. ట్విట్టర్ ట్రెండింగ్ లో కూడా టాప్ లేపైన పుష్ప సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో నడుస్తుంది. సుకుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. అసలైతే సుకుమార్ మహేష్ తో సినిమా చేయాలి. మహేష్ టైం పడుతుందని చెప్పడంతో వెంటనే బన్ని దగ్గరకు వచ్చి సినిమా ఓకే చేయించుకున్నాడు సుకుమార్. 

పుష్ప ఫస్ట్ లుక్ చూసిన మహేష్ ఫ్యాన్స్ సుకుమార్ పుష్ప లుక్ లో సూపర్ స్టార్ ను ఊహించుకుంటున్నారు. పుష్ప రాజ్ గా ఊర మాస్ లుక్ లోబన్ని ఓకే కానీ అదే లుక్ లో మహేష్ కష్టమే అంటున్నారు. అయితే ఎలాంటి పాత్ర అయినా చేసేసట్ఠా ఉన్నా సరే మహేష్ తో ఇలాంటి కల్ట్ మూవీ అంటే డీ గ్లామరస్ గా నటించాల్సి ఉంటుంది. అందుకు దాదాపుగా మహేష్ నో చెబుతాడు. అందుకే మహేష్ పుష్పని వదులుకుని మంచి పనే చేశాడని అంటున్నారు. అయితే ఈ సినిమాతో కొన్నాళ్లుగా అల్లు అర్జున్ ప్లాన్ చేసిన పాన్ ఇండియా మూవీ కల నెరవేరుతుంది.