గురు శిష్యులుగా చిరు, చరణ్..!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో ప్లే చేస్తున్నాడు. అయితే సినిమాలో చిరు, చరణ్ తండ్రి కొడుకులుగా కాదు గురు శిష్యులుగా నటిస్తున్నారని తెలుస్తుంది. చిరు, చరణ్ ఒకేసారి స్క్రీన్ పై కనిపిస్తే ఆ క్రేజ్ మాములుగా ఉండదు.   

చరణ్ మగధీర సినిమాలో చిరు గెస్ట్ గా కనిపించి అలరించాడు. ఇక చరణ్ బ్రూస్ లీ లో కూడా చిరు రీ ఎంట్రీ అదిరింది. ఇక ఇప్పుడు మొదటిసారి చిరు సినిమాలో చరణ్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాకు కీలకంగా చరణ్ పాత్ర ఉంటుంది. చిరు, చరణ్ ఇద్దరు కనిపించే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా ఉంటాయని అంటున్నారు. ఈ దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ మూవీ మెగా ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా ఉంటుందని చెప్పొచ్చు.