చంద్రముఖి-2 అతను చేస్తున్నాడు..!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పి.వాసు డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ చంద్రముఖి. 2005లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. కన్నడ ఆప్తమిత్రకు అఫీషియల్ రీమేక్ అయిన చంద్రముఖి తెలుగు, తమిళ భాషల్లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో ఆ సినిమా సీక్వల్ చేయడానికి ప్రయత్నించలేదు కానీ తెలుగులో చంద్రముఖి సీక్వల్ గా విక్టరీ వెంకటేష్ హీరోగా నాగవల్లి సినిమా చేశాడు. 

పి.వాసు డైరెక్ట్ చేసిన ఈ సినిమా నాగవల్లి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదు. ఇక లేటెస్ట్ గా డ్యాన్స్ మాస్టర్ కమ్ హీరో కమ్ డైరక్టర్ లారెన్స్ చంద్రముఖి సీక్వల్ స్టార్ట్ చేశాడు. పి.వాసు ఈ సినిమానే చంద్రముఖి 2ని డైరెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది. సినిమాలో కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. రజిని ఆశీస్సులతోనే ఈ సినిమాను రీమేక్ చేస్తున్నట్టు తెలిపాడు లారెన్స్.