ఒక పోలీస్ బిడ్డగా వాళ్లకు హ్యాట్సాఫ్..!

రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పనితీరు అద్భుతం.. నిద్రాహారాలు మాని వాళ్ళు పడుతున్న కష్టం అంతాఇంతా కాదు హైదరాబాద్ లో ప్రత్యక్షంగా చూసున్నాను.. పోలీసుల పనితీరు వల్ల లాక్ డౌన్ సక్సెస్ ఫుల్ గా జరుగుతుంది. కరోనా విజృంభణ చాలావరకు అదుపులోకి వచ్చింది పోలీసుల వల్లే. సామాన్య జనం కూడా పోలీసులకు సహకరించాలని కోరుతున్నా అన్నారు చిరంజీవి. కరోనాని అంతమొందించడంలో వాళ్లకు చేదోడువాదోడుగా ఉండాలని.. పోలీసు వారు చేస్తున్న ఈ అమోఘమైన ప్రయతనానికి ఒక పోలీస్ బిడ్డగా వాళ్లకు చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నాను.. అంటూ ఒక వీడియో మెసేజ్ పెట్టారు చిరంజీవి. 

అంతకుముందే ఇలాంటి సవాలు విసిరే టైం లో ప్రజల కుటుంబాలను, ఆరోగ్యాలను కాపాడుతున్న పోలీసులకు కృతజ్ఞతలు. దేశం పట్ల మీ నిస్వార్థమైన అంకితభావానికి నమస్కరిస్తున్నాను అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పోలీసులు పనిచేస్తున్న తీరుకి అందరు వాళ్లకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.