బాలయ్యకు డైలాగ్స్ లేకుండా కష్టమేమో..!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. అయితే ఒక రోల్ అఘోరా లుక్ లో కనిపిస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ సినిమాలో ఆ పాత్రకు డైలాగ్స్ ఉండవని తెలుస్తుంది. బాలకృష్ణ సినిమాల్లో డైలాగ్స్ చాలా ఫేమస్ అలాంటిది ఆయన డైలాగ్స్ లేకుండా చేయడం అంటే ప్రయోగమే అని చెప్పొచ్చు. 

ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులు, రూలర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అందుకే బోయపాటి శ్రీను సినిమాపై జాగ్రత్త పడుతున్నాడు బాలకృష్ణ. అయితే ఒక పాత్రకు అసలు డైలాగ్స్ లేకుండా చేయడం మాత్రం నందమూరి ఫ్యాన్స్ ను షాక్ అయ్యేలా చేస్తుంది. ఈ సినిమా కోసం బాలకృష్ణ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమాను ఈ ఇయర్ దసరాకి రిలీజ్ ప్లాన్ చేయాలని అనుకున్నారు. మరి ఇప్పుడు అది సాధ్యపడుతుందో లేదో చూడాలి.