తుపాకి సీక్వల్.. హీరోనే కాదు హీరోయిన్ కూడా రిపీట్..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా మురుగదాస్ డైరక్షన్ లో వచ్చిన సినిమా తుపాకి. తమిళంలోనే కాదు తెలుగులో కూడా రిలీజై సూపర్ హిట్ అందుకున్న ఆ సినిమా సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నాడు మురుగదాస్. మురుగదాస్ విజయ్ కాంబో అనగానే ఆ సినిమాపై అంచనాలు పెరుగుతాయి. తుపాకీ తర్వాత సర్కార్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక విజయ్తుపాకి సీక్వల్ లో హీరోయిన్ గా మళ్ళీ కాజల్ ను ఎంచుకున్నట్టు తెలుస్తుంది.

తుపాకిలో కూడా అమ్మడు హీరోయిన్ గా నటించింది. ఈ సీక్వల్ లో కూడా కాజల్ కు లక్కీ ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో ఛాన్స్ అందుకున్న ఈ అమ్మడు తుపాకి 2లో ఛాన్స్ అందుకోవడం చూస్తుంటే కాజల్ కు మరో రెండు మూడేళ్ళ దాకా తిరుగులేదని చెప్పొచ్చు. మాములుగా స్టార్ సినిమా సీక్వల్ అంటే హీరో డైరక్టర్ రిపీట్ అయినా హీరోయిన్ ను మార్చేస్తారు కానీ తుపాకి 2లో హీరోయిన్ కూడా రిపీట్ అవుతూ కాజల్ తన సత్తా చాటుతుంది.