
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆర్య, ఆర్య 2 తర్వాత సుక్కు, బన్ని ఇద్దరు కలిసి హ్యాట్రిక్ కాంబినేషన్ లో చేస్తున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోందని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా శేషాచలం అడవుల్లో షూటింగ్ జరుపుకోనుందట. ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపిస్తాడట. అందుకోసం రఫ్ లుక్ ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే బన్ని గెడ్డం పెంచేస్తున్నాడు.
ఇదిలాఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు బన్నీ ఫ్యాన్స్.. అదేంటి రిలీజ్ చేయాల్సింది చిత్రయూనిట్ కదా అనుకోవచ్చు.. అఫీషియల్ ఫస్ట్ లుక్ లేట్ అయ్యేలా ఉందని బన్ని ఫ్యాన్స్ అత్యుత్సాహంతో క్రియేటివ్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. షాకింగ్ ఏంటంటే ఈ ఫ్యాన్ మేడ్ లుక్ అఫీషియల్ ది అని చెప్పినా నమ్మేలా ఉంది. ప్రస్తుతం ఈ ఫ్యాన్ మేడ్ బన్ని పోస్టర్ సోషల్ వైరల్ గా మారింది.