
కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి సహాయంగా తెలుగు సినీ సెలబ్రిటీస్ ఇప్పటికే చాలామంది విరాళాలు ప్రకటించారు. వారి స్ఫూర్తితో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా 1 కోటి రూపాయలు సినీ కార్మికులు. హెల్త్ వర్కర్స్ కోసం ప్రకటించారు. ఆపద ఎలాంటిదైనా సరే మేమున్నా అంటూ రీల్ హీరోస్ రియల్ హీరోయిజం చూపిస్తారు. ఇప్పటికే అల్లు అర్జున్ కోటి పాతిక లక్షల విరాళం అందించడమే కాకుండా తన స్టాఫ్ కు నెల జీతంతో పాటుగా మరో 50 శాతం ఎక్కువ ఇచ్చాడట.
ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఏకంగా పాతిక కోట్ల రూపాయలు పీఎం కేర్స్ ఫండ్ కు ప్రకటించినట్టు తెలుస్తుంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరం తగిన జాగ్రత్తలు వహించాలని.. ఎవరి ఇళ్లల్లో వారు ఉంటే చాలు కరోనా నుండి తప్పించుకునే అవకాశం ఉందని అంటున్నారు. కరోనా వల్ల లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వాలు నిత్యావసరాలు ఇబ్బంది పడకుండా చూస్తున్నారు.