
రాజమౌళి డైరక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ అదేనండి రౌద్రం రణం రుధిరం సినిమా ఫస్ట్ లుక్ టీజర్ వచ్చింది. అల్లూరి సీతారామరాజుగా చరణ్ సర్ ప్రయిజ్ లుక్ తో షాక్ ఇచ్చాడు. అల్లూరిగా అదిరిపోయే లుక్ తో చరణ్ తన పర్ఫార్మెన్స్ తో దుమ్ముదులిపేశాడు. చరణ్ ఇంట్రడక్షన్ గురించి తారక్ వాయిస్ ఓవర్ తో చెప్పించడం ఇంకాస్త ఇంప్యాక్ట్ అయ్యేలా చేసింది.
ఆడు కనవడితే నిప్పుకణం నిలవడినట్టుంటది.. కలవడితే ఏగుచుక్క ఎగబడినట్టుంటది. ఎదురుబడితే సావుకైనా సెమ్ట ధారకడ్తది. ప్రాణమైనా.. బందూకైనా వానికి బాంచనైతది... ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. నా అన్న. మన్నెం దొర. అల్లూరి సీతారామరాజు అంటూ ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్ తో తేరా మీద అల్లూరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. చరణ్ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది ఆర్.ఆర్.ఆర్.